భారీ బడ్జెట్ తో మరోసారి “బాహుబలి”.?

Published on Mar 17, 2021 8:01 am IST

మన ఇండియన్ బాక్సాఫీస్ వద్ద బాహుబలి సెన్సేషన్ కోసం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరియు దర్శక ధీరుడు రాజమౌళిల ఐదేళ్ల త్యాగానికి ప్రతిఫలం తెలుగు సినిమాను ఖండాంతరాల్లో తెలుగు సినిమా మరో స్థాయికి వెల్లడం. అయితే ఈ సిరీస్ కోసం ఎంత చెప్పినా తక్కువే కానీ లేటెస్ట్ గా మరో సెన్సేషనల్ టాపిక్ ఇప్పుడు బయటకు వచ్చింది.

మొదటగా ఈ చిత్రాన్ని ఒక పార్ట్ గానే తీయాలి అనుకున్న సంగతి తెలిసిందే కానీ అది కాస్తా రెండు భాగాలుగా అయ్యింది. అయితే ఇప్పుడు అసలు బాహుబలి బిగినింగ్ కు కథ ఏమిటి అన్నది తెరకెక్కనున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా లోతుగా వెళ్లినట్టు అయితే ఈ “బాహుబలి బిఫోర్ బిగినింగ్” ను దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ నుంచి 9 ఎపిసోడ్స్ కలిగిన సిరీస్ గా ఇది రానున్నట్టు టాక్ ఇప్పుడు తెలుస్తుంది.

అంతే కాకుండా ఈ సిరీస్ ను ఏకంగా 200 కోట్లు పెట్టి తీయనున్నారట. మరి మళ్ళీ రాజమౌళినే దర్శకత్వం వహిస్తారా ప్రభాస్ కూడా ఉంటాడా ఈ సిరీస్ నిజంగానే ఉంటుందా ఉండదా అనే ప్రశ్నలకు ఇంకా సమాధానం దొరకాల్సి ఉంది. మొత్తానికి మాత్రం ఈ బిఫోర్ బాహుబలి బిగినింగ్ కు సంబంధించే మంచి హాట్ టాపిక్ సోషల్ మీడియాలో నడుస్తుంది.

సంబంధిత సమాచారం :