
ఏడు పదుల వయసు గల ఇండియన్ మెగస్టార్ అమితాబ్ బచ్చన్ ను యాంగ్రీ యంగ్ మాన్ గా చూపించి ‘బుడ్డా హొగా తేరా బాప్’ సినిమాతో హిట్ కొట్టారు పూరి జగన్నాధ్. హిందీలో పూరి తెరకెక్కించిన తొలి సినిమా ఇది. దర్శకుడిగా ఆ సినిమా పూరికి మంచి పేరు తెచ్చిపెట్టింది. తాజాగా హిందీలో మరో సినిమా రూపొందించడానికి పూరి జగన్నాధ్ సన్నాహాలు చేస్తున్నట్టు, ఆయనే స్వయంగా తెలిపారు. ఈ ఏడాది చివర్లో పూరి రెండో హిందీ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది.
ఈ నెల 13న పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన తాజా సినిమా ‘టెంపర్’ విడుదలవుతుంది. తర్వాత ఛార్మి ప్రధాన పాత్రలో తెరకేక్కే ‘జ్యోతిలక్మి’, ఆ తర్వాత వరుణ్ తేజ్ హీరోగా మరో సినిమాకు దర్శకత్వం వహిస్తారు. ఈ రెండు సినిమాల తర్వాత హిందీ సినిమా ఉంటుందని పూరి తెలిపారు.