పవన్ కోసం హరీష్ అదిరిపోయే వన్ లైనర్స్..!

Published on Mar 24, 2020 5:07 pm IST

పవన్ ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న కాంబినేషన్ రానే వచ్చింది. పవన్ కళ్యాణ్ కి గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన హరీష్ శంకర్ తో మూవీ చేయాలని వాళ్ళు ఎప్పటి నుండో అనుకుంటున్నారు. పవన్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడంతో ఇక వారి కోరిక తీరదు అనుకుంటున్న సమయంలో పవన్ కమ్ బ్యాక్ ఇవ్వడమే కాకుండా, హరీష్ తో మూవీ ప్రకటించి వారి ఆశకు ఊపిరి పోశారు.

ఇక ప్రస్తుతం హరీష్ ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్ పనులలో ఉండగా పవన్ కోసం అద్భుతమైన స్క్రిప్ట్ సిద్ధం చేసి వుంచారట. గబ్బర్ సింగ్ సినిమాలో మాదిరి అదిరిపోయే వన్ లైనర్స్, మాస్ మేనరిజం రాసుకొని వుంచారట. తెరపై హరీష్ రాసిన వన్ లైనర్స్ ఓ రేంజ్ లో పేలడం ఖాయం అని వినికిడి. గబ్బర్ సింగ్ లో హరీష్ రాసిన, నాకు కొంచెం తిక్కుంది, దానికి ఓ లెక్కుంది.. రాసుకోరా సాంబా…, వంటి వన్ లైనర్స్ చాలా పాపులర్ అయ్యాయి.

సంబంధిత సమాచారం :

X
More