మరోసారి తెరపైకి మహేష్ మోస్ట్ వాంటెడ్ ప్రాజెక్ట్.!

Published on Sep 29, 2020 7:09 am IST

ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకుడు పరశురాం తో “సర్కారు వారి పాట” అనే చిత్రంలో నటించనున్న సంగతి తెలిసిందే. అయితే ఇలా మహేష్ లాంటి స్టార్ హీరోలతో కొందరు స్టార్ దర్శకుల కాంబోలో ఇప్పటికీ కొన్ని ప్రాజెక్టు లు అలా మోస్ట్ అవైటెడ్ గా నిలిచిపోయాయి.

అలా మహేష్ కెరీర్ లో ఎప్పటి నుంచో వాంటెడ్ గా నిలిచిపోయిన చిత్రం “జనగణమన”. మహేష్ కెరీర్ లో రెండు పక్కా మాస్ ఎంటర్టైనర్స్ ఇచ్చిన పూరి జగన్నాథ్ పుట్టినరోజు నిన్న కావడంతో మహేష్ ఎంతో ఆప్యాయంగా విషెస్ తెలియజేసారు. ఇక అక్కడ నుంచి వీరి కాంబో నుంచి ముచ్చటగా ఆ మూడో సినిమాను తొందరగా మొదలు పెట్టేయాలని ఫ్యాన్స్ డిమాండ్ చెయ్యడంతో ఈ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ మరోసారి వెలుగులోకి వచ్చింది.

మహేష్ ఇపుడు చేస్తున్న సర్కారు వారి పాట అనంతరం దిగ్గజ దర్శకుడు రాజమౌళితో ఒక ప్రాజెక్ట్ ఉంది. కానీ అది మొదలు పెట్టే లోపు మరో రెండు సినిమాలు మహేష్ పూర్తి చేసే సూచనలు ఉన్నాయని గట్టి టాక్. మరి అలా అన్నీ సెట్ అయితే మహేష్ పూరీల కాంబో మరోసారి పట్టాలెక్కేందుకు టైం దొరికినట్లు అవుతుంది. మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :

More