మరోసారి హాట్ టాపిక్ గా “విక్రమార్కుడు2”

మరోసారి హాట్ టాపిక్ గా “విక్రమార్కుడు2”

Published on Apr 19, 2024 9:00 PM IST

దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ చిత్రాలలో విక్రమార్కుడు ఒకటి. ఈ చిత్రం తో మాస్ మహారాజ రవితేజ మరో లెవెల్ పెర్ఫార్మెన్స్ చూపించారు. పవర్ ఫుల్ అండ్ కామెడీ రోల్స్ తో రెండు డిఫెరెంట్ గెటప్ లలో ఆడియెన్స్ ను, ఫ్యాన్స్ ను విశేషం గా ఆకట్టుకున్నారు. ఈ చిత్రం సెక్వెల్ పై మరోసారి ప్రొడ్యూసర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

విక్రమార్కుడు 2 స్క్రిప్ట్ ను రైటర్ విజయేంద్ర ప్రసాద్ పూర్తి చేశారు అని అన్నారు. హిందీలో రౌడీ రాథోర్ 2 కూడా పూర్తి చేశారు అని అన్నారు. సబ్జెక్ట్ అంతా రెడీ గా ఉందని, సరైన కాస్టింగ్ దొరికితే రెడీ అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాక సల్మాన్ ఖాన్ బ్లాక్ బస్టర్ మూవీ భజరంగి భాయిజాన్ చిత్రం కి సీక్వెల్ కూడా రెడీ గా ఉందని పేర్కొన్నారు. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు