మరోసారి రష్మిక-విజయ్‌దేవరకొండ కాంబినేషన్..!

Published on Feb 27, 2021 9:02 am IST

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నాడు. పూరి జగన్నాథ్ లైగర్ మూవీ తర్వాత తన తదుపరి చిత్రంలో క్యూట్ బ్యూటీ రష్మికతో మరోసారి విజయ్ జతకట్టబోతున్నట్టు తెలుస్తుంది. అయితే గతంలో వీరిద్దరూ గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో నటించి క్రేజీ జంటగా యూత్‌గా బాగా కనెక్ట్ అయిపోయారు. దీంతో వీరిద్దరి జంటను మరోసారి చూసేందుకు అభిమానులు ఎంతో కుతూహులంగా ఉన్నారు.

ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ సినిమా లైగర్ షూటింగ్‌లో బిజీగా ఉండగా, రష్మిక పుష్ప, మిషన్ మజ్ను చిత్రాల్లో బిజీగా ఉంది. అయితే వీటి తర్వాత ఆమె విజయ్‌తో చేసే చిత్రం షూటింగ్ ఉండబోతుందని టాక్ నడుస్తుంది.

సంబంధిత సమాచారం :