విడుదల కి ముందే ఆర్ ఆర్ ఆర్ మూవీ రికార్డ్!

Published on Dec 23, 2021 11:12 pm IST


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రౌద్రం రణం రుధిరం. ఈ చిత్రం జనవరి 7 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. యూ ఎస్ లో ఈ చిత్రం ప్రీమియర్స్ జనవరి 6 న మొదలు కానున్నాయి. అయితే ఇప్పటి వరకూ ప్రీ సేల్స్ తో వన్ మిలియన్ డాలర్లు రావడం విశేషం. ఇందుకు సంబంధించిన ఒక పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది

వన్ మిలియన్ డాలర్లు విడుదల కి ముందే రావడం తో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. ఇప్పటి వరకూ ఏ భారతీయ సినిమా కి ఇలాంటి రెస్పాన్స్ రాలేదు. ఆర్ ఆర్ ఆర్ మూవీ మున్ముందు ఇంకెన్ని రికార్డు లని సాధిస్తుందొ చూడాలి. ఈ చిత్రం లో అలియా భట్, ఒలివియా మోరిస్ లు హీరోయిన్స్ గా నటించారు. అజయ్ దేవగన్, శ్రియ శరణ్, సముద్ర ఖని లు కీలక పాత్రల్లో నటించారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించారు.

సంబంధిత సమాచారం :