వన్ మిలియన్ వ్యూస్ తో టాప్ ట్రెండ్ లో కొనసాగుతున్న “డెవిల్”

Published on Jul 6, 2021 11:31 pm IST


కళ్యాణ్ రామ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయా చిత్రాలకు సంబందించిన ఫస్ట్ లుక్ లు, టీజర్లు, పోస్టర్లు విడుదల అయిన సంగతి తెలిసిందే. అయితే డెవిల్ చిత్రం అనౌన్స్ మెంట్ టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ టీజర్ ఇప్పుడు వన్ మిలియన్ వ్యూస్ తో టాప్ ట్రెండ్ లో కొనసాగుతోంది. డెవిల్ చిత్ర టైటిల్ కు బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అంటూ జత చేసిన క్యాప్షన్ అభిమానులను, ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. నవీన్ మేడారం స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ను అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం హర్ష వర్ధన్ రామేశ్వర్ అందిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విషయాలు ఇంకా తెలియాల్సి వుంది.

సంబంధిత సమాచారం :