‘మెల్ల మెల్లగా’.. వన్ మిలియన్ వ్యూస్ !

Published on May 2, 2019 6:23 pm IST

యంగ్ హీరో అల్లు శిరీష్ హీరోగా వస్తోన్న ‘ఏబిసిడి’ చిత్రం నుండి ఇటీవలే విడుదలైన ‘మెల్ల మెల్లగా’ వీడియో సాంగ్ కు వన్ మిలియన్ వ్యూస్ వచ్చాయి. మొత్తానికి సాంగ్ నెటిజన్లను బాగానే ఆకట్టుకుంటుంది. సంజీవ్ రెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇక ఈ క్రేజీ ప్రాజెక్టును మధుర ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై మధుర శ్రీధర్ రెడ్డి, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ పై యష్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డి సురేష్ బాబు ఈ చిత్ర స‌మ‌ర్ప‌కులు.

మెగాబ్ర‌ద‌ర్ నాగ‌బాబు, బాల నటుడు భరత్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అల్లు శిరీష్ సరసన రుక్సార్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ జుధా సాంధీ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. మంచి హిట్ కోసం ఎప్పటినుంచో ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోన్న అల్లు శిరీష్ ఈ సినిమాతో భారీ హిట్ కొడతాడేమో చూడాలి.

వీడియో సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

సంబంధిత సమాచారం :

More