ఆది పినిశెట్టి సినిమాలో మరో హీరోయిన్ !
Published on Dec 7, 2017 10:02 am IST

కోనా వెంకట్‌ ఫిల్మ్‌ కార్పొరేషన్‌, ఎంవీవీ సినిమాస్‌ సంయుక్తంగా ఆది పినిశెట్టి హీరోగా తాప్సి హీరోయిన్ గా ఒక సినిమా ప్రారంభం కానుంది. ‘లవర్స్‌’ సినిమా దర్శకుడు హరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కొత్త కథాంశంతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. డిసెంబరు 21 నుంచి ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభం కాబోతోంది.

తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ లో మరో కథానాయిక నటించబోతుందనితెలుస్తోంది. త్వరలో చిత్ర యూనిట్ ఈ కథానాయిక పేరు వెల్లడించనున్నారు. ఆనందో బ్రహ్మ సినిమా తరువాత తాప్సి చేస్తోన్న సినిమా ఇదే అవ్వడం విశేషం. పలు సినిమాలకు రచయితగా పనిచేసిన భవాని ప్రసాద్ ఈ సినిమాకు మాటలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఆది పినిశెట్టి రంగస్థలం లో రామ్ చరణ్ తో కలిసి నటించబోతున్న సంగతి తెలిసిందే.

 
Like us on Facebook