కమల్ “థగ్ లైఫ్” నుంచి క్రేజీ అప్డేట్ కి టైం ఖరారు

కమల్ “థగ్ లైఫ్” నుంచి క్రేజీ అప్డేట్ కి టైం ఖరారు

Published on May 7, 2024 1:12 PM IST


లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా ఎన్నో ఏళ్ల తర్వాత లెజెండరీ దర్శకుడు మణిరత్నం కాంబినేషన్ లో చేస్తున్న భారీ చిత్రం “థగ్ లైఫ్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం షూటింగ్ ని అనేక దేశాల్లో ప్లాన్ చేస్తుండగా కమల్ కూడా ఇప్పుడు షూట్ లో పాల్గొంటున్నారు. అయితే ఈ చిత్రంలో మరింతమంది టాలెంటెడ్ యంగ్ హీరోస్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి వీరిలో హీరో శింబు కూడా ఉన్నాడని కొన్ని రూమర్స్ ఉన్నాయి.

అయితే ఇప్పుడు ఇది నిజం కానున్నట్టుగా తెలుస్తుంది. తమ టీం లోకి కొత్త థగ్ రాబోతున్నాడు అంటూ మేకర్స్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ అనౌన్సమెంట్ చేశారు. అలాగే రేపు ఉదయం 10 గంటలకి దీనిని రివీల్ చేస్తున్నట్టుగా తెలిపారు. మరి ఈ సినిమాలో ఉన్నది శింబు యేన లేక మరో అప్డేట్ ఏమన్నా వస్తుందేమో వేచి చూడాలి. ఇక ఈ భారీ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా రాజ్ కమల్ ఫిల్మ్స్ బ్యానర్ పై కమల్, ఆర్ మహేంద్రన్ లు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు