వర్మ చిత్రంపై మరో పిటీషన్

వర్మ చిత్రంపై మరో పిటీషన్

Published on Nov 27, 2019 12:05 AM IST

varma

దర్శకుడు వర్మ తెరకెక్కించిన తాజా చిత్రం కమ్మరాజ్యంలో కడపరెడ్లు. ఈ నెల 29వ తేదిన ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్,సాంగ్స్ విడుదలై మూవీపై అంచనాలను పెంచేశాయి.. అటు చంద్రబాబు నాయుడు, ఇటు జగన్ పై కూడా ఈ మూవీలో వీర సెటైర్ లున్నాయి.. ఇక కె ఎ పాల్, నారా లోకేష్ లపై చేరో సాంగ్ ను కూడా వర్మ షూట్ చేసేశాడు..రాజకీయా మసాలా సినీమా రిలీజ్ ను ఆపాలని కోరుతూ కె ఎ పాల్ ఇప్పటికే ఎపి హైకోర్టులో ఆశ్రయించారు.

తాజాగా తెలంగాణ హైకోర్టులో కూడా మరో పిటిషన్ దాఖాలు చేశారు ఇంద్రసేనా చౌదరి. కమ్మరాజ్యంలో కడపరెడ్లు చిత్రం కులాల మధ్య చిచ్చుపెట్టే అవకాశముందని, సినిమా విడుదల నిలిపివేయాలని హైకోర్టును ఆయన ఆశ్రయించారు. ఈ సినిమా రిలీజ్ అయితే కమ్మ, రెడ్డి కులస్తుల మధ్య ఘర్షణ పూరిత వాతావరణం నెలకొనే అవకాశం ఉందని పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ ను స్వీకరించిన హైకోర్టు రేపు విచారణ జరపాలని నిర్ణయించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు