నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన తండ్రి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్’ బయోపిక్ చిత్రంలో నటిస్తున్నాడు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 5నుండి ప్రారంభమైంది. ఈ చిత్ర షూటింగ్ 6నెలల్లో పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు చిత్ర యూనిట్.
ఇక ప్రకాష్ రాజ్, మోహన్ బాబు , విద్యాబాలన్ మొదలైన ప్రముఖ తారాగణం నటిస్తున్నఈ చిత్రంలో తాజాగా మరో నటుడు జాయిన్ అయ్యారు. ప్రముఖ సీనియర్ హీరో, సపోర్టింగ్ యాక్టర్ నరేష్ ప్రముఖ దర్శకుడు , నిర్మాత బి ఏ సుబ్బారావు గారి పాత్రలో నటిస్తున్నాడు.


