ఆకట్టుకుంటున్న హన్సిక “వన్ నాట్ ఫైవ్” ఫస్ట్ అండ్ సెకండ్ లుక్స్!

Published on Aug 9, 2021 5:05 pm IST


హన్సిక మొత్వని ప్రధాన పాత్రలో వన్ షాట్ మూవీ గా తెరకెక్కుతున్న చిత్రం వన్ నాట్ ఫైవ్ మినిట్స్. ఈ చిత్రం కి సంబంధించిన ఫస్ట్ లుక్ ను ప్రముఖ దర్శకుడు బాబీ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. హన్సిక పుట్టిన రోజు సందర్భంగా విడుదల అయిన ఈ ఫస్ట్ లుక్ పై బాబీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫస్ట్ లుక్ ను విడుదల చేయడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. అంతేకాక హన్సిక కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. రుద్రాన్ష్ సెల్యులాయిడ్ పతాకం పై బొమ్మక్ శివ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం రాజు దుస్సా అందిస్తున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల అయిన కొద్ది సేపటికే చిత్ర యూనిట్ సెకండ్ లుక్ ను విడుదల చేయడం జరిగింది. అయితే హన్సిక ఈ చిత్రం లో ఎన్నడూ చేయని డిఫెరెంట్ పాత్రను చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ లుక్ మరియు సెకండ్ లుక్ లు రెండూ కూడా ఆకట్టుకోవడం తో సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :