‘బాహుబలి’కి పోటీగా రిలీజవుతున్న ఒకే ఒక్క సినిమా !
Published on Apr 6, 2017 9:42 am IST


‘బాహుబలి – ది బిగినింగ్’ చిత్రం ఈ నెల 28న రిలీజ్ కానున్న సందర్బంగా చిన్న, పెద్ద సినిమాలేవీ ఈ నెలాఖరు నుండి మే నెల మధ్య వరకు రిలీజ్ కావడం లేదు. ముందుగా ఏప్రిల్ మధ్యలో విడుదలైతే బాహుబలి రిలీజ్ సమయానికి అన్ని థియేటర్లు ఖాళీ చేయవలసి వస్తుంది, అలా కాకుండా బాహుబలి తర్వాత విడుదలైతే ఆ చిత్రం యొక్క హవా ముందు నిలబడగలమా లేదా అనే అనుమానాలే ఇందుకు కారణం. అందుకే సినిమాలన్నీ బాహుబలికి దరిదాపుల్లో విడుదలకాకూడదని కొన్ని నెలక్రితమే నిర్ణయించుకున్నాయి.

కానీ ఒక సినిమా మాత్రం బాహుబలి రిజీజైన వారానికే థియేటర్లలోకి వస్తానంటోంది. అదే శ్రీనివాస్ అవసరాల అడల్ట్ కామెడీ చిత్రం ‘బాబు బాగా బిజీ’. ముందుగా ఈ సినిమాని ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నారు. కానీ అలా చేస్తే బాహుబలి సమయానికి సినిమాను థియేటర్లలోంచి తొలగించాల్సి వస్తుందని దాని కన్నా నేరుగా మే నెలలో విడుదల చేస్తే బాగుంటుందని మే 5 ను కొత్త విడుదల తేదీగా ఫిక్స్ చేశారు దర్శక నిర్మాతలు. దీంతో బాహుబలి చిత్రానికి పోటీగా రిలీజవుతున్న ఒకే ఒక సినిమాగా ఇది నిలవనుంది.

ఇప్పటికే రిలీజైన ట్రైలర్ తో ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి రేవుపైనా ఈ చిత్రం మరి బాహుబలి ముందు ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై నవీన్ మేడారం డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో శ్రీముఖి, తేజస్వి, మిస్తీ చరవర్తి, సుప్రియ ఐసోల హీరోయిన్లుగా నటించారు.

 
Like us on Facebook