ఇక ఈ సంవత్సరానికి చిరు,ప్రభాస్ లతో సరిపెట్టుకోవలసిందే.

Published on Jun 9, 2019 5:10 pm IST

ఈ ఏడాది టాలీవుడ్ టాప్ స్టార్స్ అయిన ఎన్టీఆర్ “అరవింద సమేత వీరరాఘవ”,చరణ్ “వినయ విధేయ రామ” మహేష్ “మహర్షి” చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు వినోదం పంచారు.ఇక ఈ సంవత్సరం పెద్ద హీరోల సినిమాలలో చిరంజీవి “సైరా”, ప్రభాస్ “సాహో’ మాత్రమే విడుదల కావలసి ఉన్నాయి. ‘సాహో’ ఆగస్టు 15న స్వాతంత్ర్యదినాన్నిపురస్కరించుకొని విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. తాజాగా టాకీ పార్ట్ పూర్తి చేసిన దర్శకుడు సుజీత్ మిగిలిన పాటల చిత్రీకరణ కూడాత్వరగా చిత్రికరించి చెప్పిన టైం కి విడుదల చేయడానికి కష్టపడుతున్నాడట.

దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న “సైరా” కూడా అక్టోబర్ 2 న విడుదల కానుంది.దీంతో 2019 లో స్టార్ హీరోల సినిమాలలో మిగిలింది ఈ రెండు మాత్రమే. ఎన్టీఆర్,చరణ్ లు రాజమౌళి తీస్తున్న “ఆర్ ఆర్ ఆర్” లో లాక్ అయిఉన్నారు. ఈ మూవీ 2020 జులై 30 న విడుదల కానుంది. కాబట్టి ఈ ఇద్దరు స్టార్ లు తెరపై కనిపించేది నెక్స్ట్ ఇయర్ మాత్రమే. మహేష్ అనిల్ తో చేస్తున్న “సరిలేరు నీకెవ్వరు” బన్ని, త్రివిక్రంల మూవీ తో పాటు బాలయ్య మూవీ కూడా 2020 సంక్రాంతి ని ఖాయం చేసుకున్నారు. దీనితో చిన్న సినిమాలు, చిన్న హీరోలదే మిగిలిన ఏడాదంతా. సో థియేటర్ల సమస్యతో బాధపడే చిన్న సినిమాలకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :

More