‘ఓ బావ’తో.. ‘ప్రతిరోజూ పండగే’ !

Published on Nov 18, 2019 5:34 pm IST

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా మారుతీ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం “ప్రతి రోజు పండగే”. కాగా ఈ సినిమా నుండి ‘ఓ బావ మా అక్కని సక్కగా సూస్తావా’ అనే సాంగ్ లిరికల్ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. కె.కె రాసిన ఈ సాంగ్ ను సత్య యామిని, మోహన భోగరాజు, హరి తేజ కలిసి పాడారు. తమన్ అద్భుతమైన ట్యూన్ తో ఈ పాటను చక్కగా తీర్చిదిద్దారు. వినగానే ఈ పాట శ్రోతల్ని బాగా ఆకట్టుకుంటుంది. క్లాస్ సాంగ్ కి మంచి పోక్ టచ్ ఇస్తూ పాట సాగడంతో సాంగ్ చాలా త్వరగా జనానికి కనెక్ట్ అవుతుంది.

ఇక క్రిష్టమస్ సందర్భంగా డిసెంబర్ 20న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. పల్లెటూరి నేపథ్యంలో సాగే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో ధరమ్ తేజ్ సరసన రాశి ఖన్నా నటిస్తున్నారు. గతంలో వీరిద్దరూ “సుప్రీం” సినిమాలో కలిసి నటించడం జరిగింది. ఇక మిగిలిన కీలక పాత్రల్లో సత్యరాజ్, విజయ కుమార్, రావ్ రమేష్, మురళీ శర్మ తదితరులు నటిస్తుండగా, అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :

X
More