
టాలీవుడ్ లో మల్టీ స్టారర్ సినిమాలు ఊపందుకున్న తరుణంలో తెలుగు – తమిళ స్టార్స్ కలిసి చేస్తున్న మల్టీ స్టారర్ మూవీ ‘ఊపిరి’. కింగ్ నాగార్జున – తమిళ యంగ్ హీరో కార్తీ కాంబినేషన్ లో ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో వస్తున్న ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ లో తమన్నా హీరోయిన్ గా కనిపించనుంది. ఇటీవలే ఈ చిత్ర టీం లండన్ లో ఓ మేజర్ షెడ్యూల్ ని పూర్తి చేసుకొని ఇండియాకి తిరిగి వచ్చారు. ఆ తర్వాత కాస్త గప్ తీసుకున్న ఈ చిత్ర టీం లేటెస్ట్ షెడ్యూల్ ని హైదరాబాద్ లో మొదలు పెట్టారు.
ప్రస్తుతం నాగార్జున – కార్తీలపై వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ తో దాదాపు సినిమా పూర్తయ్యే అవకాశం ఉంది. నాగార్జున ఈ సినిమాలో ఎక్కువ భాగం వీల్ చెయిర్ లోకనిపిస్తాడు. ఈ సినిమాలో వీరితో పాటు ఓ ముఖ్య పాత్రలో అనుష్క – అడవి శేష్ జంటగా కనిపించనున్నారు. ఇప్పటికే 80% పైన షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా హాలీవుడ్ మూవీ ‘ది ఇంటచబుల్స్’ కి రీమేక్ గా తెరకెక్కుతోంది. పివిపి బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాకి గోపి సుందర్ మ్యూజిక్ డైరెక్టర్.

