ఆపరేషన్ 2019 విడుదల తేదీ ఖరారు !
Published on Sep 11, 2018 11:06 pm IST


సీనియర్ హీరో శ్రీకాంత్ నటిస్తున్న కొత్త చిత్రం ఆపరేషన్ 2019. ప్రస్తుతం ఈచిత్రం యొక్క షూటింగ్ హైద్రాబాద్లో జరుగుతుంది. శ్రీకాంత్ నటించిన సూపర్ హిట్ చిత్రం ఆపరేషన్ దుర్యోధన కు సీక్వెల్ గా తెరకెక్కుతుంది ఈ చిత్రం.

కరణం బాబ్జి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 28న విడుదల కానుంది. మంచు మనోజ్ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈచిత్రానికి షకీల్ సంగీతం అందిస్తున్నాడు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈచిత్రంలో కోట శ్రీనివాసరావు , సుమన్ , దీక్ష పంత్ తదితరులు నటిస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook