200 పర్సెంట్ హానెస్ట్‌గా ఉండాలనుకుంటున్న సిద్ధార్థ్..!

Published on Aug 4, 2021 9:00 pm IST

హీరో సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో ‘బిచ్చగాడు’ సినిమా దర్శకుడు శశి తెరెక్కించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఒరేయ్‌ బామ్మర్ది’. శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ పతాకంపై ఏఎన్ బాలాజీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో జీవీ ప్రకాష్ కుమార్ కీలక పాత్ర పోశిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 13న థియేటర్లల్ విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా నేడు సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో సిద్ధార్థ్ ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు.

అయితే పోలీస్ లైఫ్‌లో క్రిమినల్స్‌తోనూ, వాళ్లు చేసే క్రైమ్స్‌తోనే బతకాల్సి వస్తుంది.. డిపార్ట్‌మెంట్‌ లోపలైనా బయటైనా ఎవరితోనూ నిజాయతీగా ఉండలేకపోతున్నాను.. ఈ లోకంలో ఎవరో ఒక్కరితోనైనా 200 పర్సెంట్ హానెస్ట్‌గా ఉండాలనుకుంటున్నాను అంటూ సిద్ధార్థ్ చెప్పే డైలాగ్స్‌ ఆకట్టుకున్నాయి. అయితే ఓ ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్‌గా సిద్ధార్థ్ ఎలాంటి పరిణామాలను ఎదురుకుంటాడు? రేసర్‌గా కనిపిస్తున్న జీవీ ప్ర‌కాశ్‌కు, సిద్ధార్థ్‌కు మధ్య ఎలాంటి యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతుంది? అనేది తెలియాలంటే సినిమాను చూడాల్సిందే.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :