‘ఆహా’లోకి రాబోతున్న సిద్ధార్థ్ “ఒరేయ్ బామ్మర్ధి”..!

Published on Sep 25, 2021 10:14 pm IST


హీరో సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో ‘బిచ్చగాడు’ సినిమా దర్శకుడు శశి దర్శకత్వంలో వచ్చిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఒరేయ్‌ బామ్మర్ది’. శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ పతాకంపై ఏఎన్ బాలాజీ నిర్మించిన ఈ చిత్రంలో జీవీ ప్రకాష్ కుమార్ కీలక పాత్రలో నటించారు. ఆగస్టు 13న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఒటీటీలోకి రాబోతుంది.

అయితే అక్టోబర్ 1వ తేది నుంచి ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ఆహాలోకి స్ట్రీమింగ్‌లోకి రాబోతుంది. ఈ సినిమాలో సిద్ధార్థ్ ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించగా, సిద్ధార్థ్‌కి బామర్ధిగా జీవీ ప్రకాశ్ కుమార్ నటించారు. ఈ సినిమాకి సిద్ధూ కుమార్ సంగీతం అందించగా, ప్రసన్న యస్ కుమార్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు.

సంబంధిత సమాచారం :