సర్ప్రైజ్: ఆహా లోకి ఒకరోజు ముందుగానే “ఒరేయ్ బుజ్జిగా”

Published on Sep 29, 2020 11:11 pm IST

రాజ్ తరుణ్ హీరోగా మాళవిక నెయిర్ మరియు హెబ్బా పటేల్ హీరోయిన్స్ గా నటిస్తున్న చిత్రం ఒరేయ్ బుజ్జిగా. ఈ చిత్రం ఓటిటీ బాట పట్టిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఇప్పటికే ఆహా యాప్ లో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. అయితే ఈ చిత్రం అక్టోబర్ 2 న విడుదల చేయాలని నిర్ణయించిన చిత్ర యూనిట్ ప్రస్తుతం నిర్ణయాన్ని మార్చుకుంది. ఈ చిత్రాన్ని అక్టోబర్ ఒకటవ తేదీన ఆహా లో విడుదల చేయనున్నట్లు ఒక ప్రకటన లో తెలిపింది. అయితే ఇది నిజంగా సర్ప్రైజ్ అని చెప్పాలి.

రాజ్ తరుణ్ ఈ చిత్రం తో బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉందని చిత్రానికి సంబంధించిన పోస్టర్లు, ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం కొండ విజయ్ కుమార్. ఇప్పటికే పలు చిత్రాలు ఓటిటి ద్వారా విడుదల అయి విజయాన్ని దక్కించుకున్నాయి.

సంబంధిత సమాచారం :

More