నాని “దసరా” నుండి ఓరి వారి సాంగ్ మేకింగ్ వీడియో రిలీజ్!

నాని “దసరా” నుండి ఓరి వారి సాంగ్ మేకింగ్ వీడియో రిలీజ్!

Published on Feb 26, 2023 8:00 PM IST

టాలీవుడ్ స్టార్ హీరో, నేచురల్ స్టార్ నాని హీరోగా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం లో తెరకెక్కుతున్న రా అండ్ విలేజ్ యాక్షన్ డ్రామా దసరా. ఈ చిత్రం ను మార్చ్ 30, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి, పాటలకు ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఈ చిత్రం లోని ఓరి వారి పాట మేకింగ్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది.

ఈ హార్ట్ బ్రేక్ ఆంతెం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ మేకింగ్ వీడియో తో పాట ఎలా ఉండనుంది అనేది అర్థం అవుతుంది. ఇప్పటికే టీజర్ తో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. SLV సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు