నెట్‌ఫ్లిక్స్‌లో ‘హక్’ మూవీ: ఓటీటీలోకి వచ్చేసిన ‘ఓజి’ విలన్ కోర్ట్ రూమ్ డ్రామా

నెట్‌ఫ్లిక్స్‌లో ‘హక్’ మూవీ: ఓటీటీలోకి వచ్చేసిన ‘ఓజి’ విలన్ కోర్ట్ రూమ్ డ్రామా

Published on Jan 2, 2026 1:08 PM IST

Haq

ఇటీవల బాలీవుడ్ సినిమా దగ్గర వచ్చిన చిత్రాల్లో ఒక కోర్ట్‌రూమ్ డ్రామా “హక్ (Haq)”. ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. థియేటర్లలో విడుదలైన తర్వాత, ఈ మూవీ ఇప్పుడు డిజిటల్ ఆడియెన్స్ ముందుకు వచ్చింది. కమర్షియల్ సినిమాలకు భిన్నంగా, సీరియస్ కంటెంట్ మరియు బలమైన కథలను ఇష్టపడే వారికి ఈ సినిమా ఒక మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు.

కథేంటంటే?

భర్త తనను వదిలేసిన తర్వాత, ఒక మహిళ ధైర్యంగా నిలబడి చేసే న్యాయ పోరాటమే ఈ సినిమా కథ. ఇది కేవలం ఒక వ్యక్తిగత సమస్యగా మొదలై, చివరకు కోర్టు మెట్లు ఎక్కి ఆత్మగౌరవం, సమానత్వం మరియు న్యాయం కోసం జరిగే ఒక పెద్ద యుద్ధంగా మారుతుంది. అనవసరమైన హంగులు లేకుండా, కథలోని ఎమోషనల్ మరియు లీగల్ పాయింట్లపైనే దర్శకుడు ఎక్కువగా ఫోకస్ పెట్టారు.

నటీనటులు – సాంకేతిక వర్గం

ఈ సినిమాలో రీసెంట్ సెన్సేషన్ ‘ధురంధర్’ (Dhurandhar) సినిమా దర్శకుడు ఆదిత్య ధర్ భార్య, యామీ గౌతమ్ ధర్ మరియు ఓజి విలన్ ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రల్లో నటించారు. వీరితో పాటు షీబా చద్దా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపిస్తారు. సుపర్ణ్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వినీత్ జైన్, విశాల్ గుర్నానీ, జూహీ పరేఖ్ మెహతా మరియు హర్మాన్ బవేజా సంయుక్తంగా నిర్మించారు.

ఆడియెన్స్ రియాక్షన్

థియేటర్లలో హాక్ (Haq in OTT) మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, నటీనటుల పెర్ఫామెన్స్ లకి అలాగే కాన్సెప్ట్ కి మాత్రం ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అవ్వడం వల్ల ఈ సినిమాకి మరింత ఎక్కువ మంది ప్రేక్షకులు దొరుకుతారని, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ కు ఇది కనెక్ట్ అవుతుందని భావిస్తున్నారు.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు