ఆ సినిమాలు ఓటీటీ డీల్‌ని వదులుకోలేకబోతున్నాయా?

Published on Aug 8, 2021 1:43 am IST

కరోనా కారణంగా మూతపడిన సినిమా థియేటర్లు గత నెలాఖరులో తెరుచుకోవడంతో చిన్న సినిమాలన్నిటినీ దర్శక నిర్మాతలు ధైర్యం చేసి రిలీజ్ చేసుకుంటున్నారు. అయితే కాసింత ఎక్కువ బడ్జెట్ పెట్టి తీసిన సినిమాలను మాత్రం నిర్మాతలు ఓటీటీలోనే రిలీజ్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తుంది. ఇటీవల వెంకటేష్ నటించిన ‘నారప్ప’ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. దీంతో విడుదలకు సిద్ధంగా ఉన్నా చాలా సినిమాలు కూడా రిలీజ్ డేట్స్‌ని ప్రకటించకుండా కాసింత ఆలోచనలో పడ్డాయి.

ఇక తాజా బజ్ ప్రకారం ఓటీటీ సంస్థలు ఏ ఏ సినిమాలకు ఎంత ఆఫర్ చేస్తున్నాయో ఒకసారి చూస్తే శేఖర్ కముల్ల లవ్ స్టోరీకి నెట్‌ప్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌తో చర్చలు జరుగుతున్నాయని ఈ సినిమాకు రూ.39 కోట్లు ఇచ్చేందుకు సిద్దమయ్యారని సమాచారం. నాని టక్ జగదీశ్‌కు అమెజాన్ ప్రైమ్ వీడియో రూ.37 కోట్లు, వెంకటేశ్‌ దృశ్యం 2 సినిమాకి రూ.36 కోట్లు, నితిన్ మాస్ట్రోకు డిస్నీ హాట్ స్టార్ రూ.28 కోట్లు, గోపీచంద్ సీటీమార్‌కు అమెజాన్ ప్రైమ్ రూ.16 కోట్లు, శర్వానంద్ మహా సముద్రం నెట్‌ఫ్లిక్స్‌ రూ.21 కోట్లు ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. చూడాలి మరీ ఇందులో ఎన్ని సినిమాలు ఓటీటీ ఆఫర్స్‌ని అందుకుంటాయి, ఎన్ని సినిమాలు థియేట్రికల్ రిలీజ్‌కి మొగ్గు చూపుతాయనేది.

సంబంధిత సమాచారం :