ఓటీటీ ఆఫర్ దక్కించుకున్న ఇస్మార్ట్ బ్యూటీ?

Published on Jul 31, 2021 9:00 pm IST

ఈ మధ్య టాలీవుడ్ టాప్ హీరోయిన్లు సమంత, కాజల్, తమన్నా వంటి వారు ఓటీటీల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు. అయితే ఆ లిస్ట్‌లోకి ఇప్పుడు కన్నడ బ్యూటీ నభా నటేశ్ కూడా చేరిపోయింది. ఇస్మార్ట్ శంకర్, డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్ వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ కుర్ర బ్యూటీ ఇప్పుడు ఓటీటీలో తొలి అవకాశం అందుకుందని అది కూడా బాలీవుడ్ నుంచి ఆఫర్ దక్కించుకున్నట్టు తెలుస్తుంది.

కండల వీరుడు హృతిక్ రోషన్ త్వరలో ఓ వెబ్ సిరీస్
చేస్తున్నారు. జాన్ లుకరే రాసిన పుస్తకం “ది నైట్ మేనేజర్” ఆధారంగా అదే పేరుతో ఓ బ్రిటీష్ స్పై థ్రిల్లర్ తెరకెక్కింది. అయితే “ది నైట్ మేనేజర్”ను అధికారికంగా హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఇందులో హృతిక్ నటిస్తుండగా ఆయన సరసన నటించేందుకు నభా నటేశ్ ఛాన్స్ కొట్టేసినట్టు సమాచారం. అయితే దీనికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు.

సంబంధిత సమాచారం :