‘సార్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ ?

‘సార్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ ?

Published on Feb 28, 2023 9:30 PM IST

తమిళ గ్లోబల్ స్టార్ ధనుష్ హీరోగా దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్ లో లేటెస్ట్ గా తెరకెక్కించిన చిత్రం “సార్”. తమిళ్ లో “వాథి” గా రిలీజ్ అయిన ఈ చిత్రం ధనుష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ దిశగా దూసుకెళ్తుంది. ఐతే, ఈ మూవీని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ భారీ రేటుకు డిజిటల్‌ రైట్స్‌ను దక్కించుకుందని.. మార్చి 22 నుంచి మూవీ స్ట్రీమ్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇక సార్ తెలుగులో కూడా సెన్సేషనల్ రన్ ని నమోదు చేసింది. మొత్తానికి ధనుష్ కి టాలీవుడ్ లో సార్ సినిమాతో భారీ హిట్ దక్కిందని చెప్పాలి. ఇక ఈ సినిమాకి జివి ప్రకాష్ సంగీతం అందించగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. అలాగే సముద్రఖని, తనికెళ్ళ భరణి తదితరులు కీలక పాత్రల్లో నటించగా సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ 4 సినిమాస్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు