ఓటిటి రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న క్రేజీ థ్రిల్లర్ “భూతద్దం భాస్కర నారాయణ”

ఓటిటి రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న క్రేజీ థ్రిల్లర్ “భూతద్దం భాస్కర నారాయణ”

Published on Mar 16, 2024 11:25 AM IST


ప్రస్తుతం మన టాలీవుడ్ నుంచి ఎప్పటికప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ రిలీజ్ కి వస్తుంది. ఒకో సినిమా ఒకో కొత్త కాన్సెప్ట్ తో వస్తుండగా అలా ఈ మార్చ్ లో రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ చిత్రమే “భూతద్దం భాస్కర నారాయణ”. శివ కందుకూరి హీరోగా రాశి సింగ్ ఫీమేల్ లీడ్ లో దర్శకుడు పురుషోత్తం రాజు తెరకెక్కించిన ఈ క్రేజీ క్రైమ్ థ్రిల్లర్ డీసెంట్ టాక్ ని కూడా తెచ్చుకుంది. అయితే ఈ సినిమా ఇప్పుడు ఓటిటి రిలీజ్ కి డేట్ ని లాక్ చేసుకుంది.

మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహా వారు ఈ సినిమా హక్కులు సొంతం చేసుకోగా అందులో ఈ చిత్రం ఈ మార్చ్ 22 నుంచి అయితే స్ట్రీమింగ్ కి వస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. మరి ఈ థ్రిల్లర్ ని అప్పుడు మిస్ అయ్యివారు ఓటిటి లో చూడాలి అనుకుంటే ఆ సమయం వరకు ఆగితే సరిపోతుంది. ఇక ఈ చిత్రానికి టాలెంటెడ్ మ్యూజిక్ దర్శకులు విజయ్ బుల్గానిన్ అలాగే శ్రీచరణ్ పాకాల సంగీతం అందించగా స్నేహాల్ జంగాల, శశిధర్ కాశీ అలాగే కార్తీక్ నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు