ఓటిటి సమీక్ష : మమ్ముట్టి ‘క్రిస్టోఫర్’ – అమెజాన్ ప్రైమ్ లో తెలుగు డబ్బింగ్ వర్షన్

ఓటిటి సమీక్ష : మమ్ముట్టి ‘క్రిస్టోఫర్’ – అమెజాన్ ప్రైమ్ లో తెలుగు డబ్బింగ్ వర్షన్

Published on Mar 11, 2023 3:01 AM IST
Christopher Telugu Movie Review

విడుదల తేదీ : మార్చి 10, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు: మమ్ముట్టి, స్నేహ, ఐశ్వర్య లక్ష్మి, వినయ్ రాయ్, షైన్ టాన్ చాకో తదితరులు

దర్శకుడు : బి. ఉన్నికృష్ణన్

నిర్మాతలు: ఆర్ డి ఇల్యూమినేషన్స్ ఎల్ ఎల్ పి

సంగీత దర్శకులు: జస్టిన్ వర్గేసే

సినిమాటోగ్రఫీ: ఫైయజ్ సిద్దిఖ్

ఎడిటర్: మనోజ్

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా ఉన్నికృష్ణన్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ మూవీ క్రిస్టోఫర్ మూవీ నేడు ప్రముఖ ఓటిటి మాధ్యమం అమెజాన్ ప్రైమ్ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చింది. మరి ఈ మూవీ యొక్క సమీక్ష ఇప్పుడు చూద్దాం.

 

కథ:

 

ఏడీజీపీ క్రిస్టోఫర్ ఆంటోనీ (మమ్ముట్టి) ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా కేరళ పోలీస్ డిపార్ట్ మెంట్ లో వర్క్ చేస్తుంటాడు. తమ రాష్ట్రంలోని ఒక మహిళని మానభంగం చేసి చంపిన ఐదుగురు నేరస్తుల్ని అతడు ఎన్కౌంటర్ చేసి చంపుతాడు. దీని అనంతరం క్రిస్టోఫర్ మాజీ భార్య మరియు ప్రముఖ మానవ హక్కుల నేత అయిన బీనా మరియం చాకో ద్వారా కేరళ సీఎం పై వత్తిడి వస్తుంది. ఆ తరువాత ఎసిపి సురేఖ (అమల పాల్) క్రిస్టోఫర్ కేసు పై ఇన్వెస్టిగేట్ చేసి అతడి గురించి మొత్తం ఆరా తీస్తుంది. ఈ క్రమంలో అతడి గురించిన భయంకరమైన గతం ఆమె తెలుసుకుంటుంది. అసలు ఎవరీ క్రిస్టోఫర్, మధ్యలో సీతారాం త్రిమూర్తి (వినయ్ రాయ్) ఎవరు, అతడికి క్రిస్టోఫర్ గతంతో సంబంధం ఏంటి అనేటువంటి ప్రశ్నలు అన్నిటికీ సమాధానాలు దొరకాలి అంటే మూవీ చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్:

 

మరొక్కసారి ఈ మూవీలోని క్రిస్టోఫర్ పాత్ర ద్వారా అద్భుతమైన పెర్ఫార్మన్స్ ని కనబరిచారు మెగాస్టార్ మమ్ముట్టి. అలానే, ఫ్లాష్ బ్యాక్ తో పాటు ప్రస్తుత పాత్రలో కూడా ఆయన అదరగొట్టారు. ఏసిపి పాత్రలో అమల పాల్ నటన కూడా ఆకట్టుకుంది. తన గత సినిమాల పాత్రలతో పోలిస్తే ఈ పాత్ర అమల పాల్ కి మరింత మంచి పేరు తెచ్చిపెడుతుంది అనే చెప్పాలి. నిజాయితీ గల పోలీస్ అధికారి భార్య గా అలానే నేరాలు చేసే యువకుడి చెల్లెలిగా స్నేహార్ నటన ఎంతో బాగుంది. ఇక సినిమాలో మరొక కీలకమైన అమీనా పాత్రలో కనిపించిన ఐశ్వర్య లక్ష్మి కూడా తన పెర్ఫార్మన్స్ తో అలరించారు. సెకండ్ హాఫ్ లో మమ్ముట్టి తో వచ్చే ఆమె సీన్స్ ఎంతో బాగున్నాయి. జస్టిన్ వర్గేసే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా సీన్స్ లో అలరించింది. అలానే పలు స్లో మోషన్ యాక్షన్ సీన్స్ కూడా చూడడానికి బాగున్నాయి.

 

మైనస్ పాయింట్స్:

 

ఆలస్యంగా జరిగే న్యాయం వలన జరిగిన నష్టం పూడ్చబడదు అనడానికి నిదర్శనం క్రిస్టోఫర్ మూవీ. పలు లైంగిక పరమైన సన్నివేశాలతో కీలక అంశం తీసుకుని కథకుడు ఉదయ్ కృష్ణ అందించిన స్టోరీని తనదైన శైలిలో తెరకెక్కించిన దర్శకుడు ఉన్ని కృష్ణన్ ఒకింత సాగతీతగా సినిమాని నడిపించారు. నిజానికి ఈ సినిమాలోని మెయిన్ కథాంశం గతంలో పలు సినిమాల్లో చూసినదే అయినప్పటికీ దానిని ప్రస్తుతం ఆడియన్స్ ని అలరించేలా తీయడంలో దర్శకుడు విఫలం అయ్యారు. విలన్ గా నటించిన వినయ్ రాయ్ తన స్టైలిష్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నారు. అలానే హీరో మరియు విలన్ మధ్య మరింత బలమైన ఘర్షణ సీన్స్ రాసుకుని ఉంటె బాగుండేది. కథ పగంగా బాగున్నా, కొన్ని సీన్స్ లో ఎమోషన్స్ కూడా ఆకట్టుకోవు. మమ్ముట్టి మరియు ఐశ్వర్య లక్ష్మి మధ్య కొన్ని పదునైన సన్నివేశాలను చేర్చడం వలన సినిమా ఒకింత పర్వాలేదనిపిస్తుంది.

 

సాంకేతిక వర్గం:

 

కథకుడు మరియు డైరెక్టర్ ఇద్దరూ కూడా క్రిస్టోఫర్ మూవీని ఆకట్టుకునే విధమైన కథ, కథనాలతో మూవీని ముందుకు నడిపించడంలో విఫలం అయ్యారు. ఫైయజ్ సిద్దిఖ్ ఫోటోగ్రఫి సినిమాలో పలు సీన్స్ ని బాగా ఎలివేట్ చేస్తుంది. జస్టిన్ వర్గేసే అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈమూవీకి ఒకింత ప్లస్ అని చెప్పుకోవాలి. రెండు భాగాల్లో పలు అనవసమైన సీన్స్ ని కనుక తొలగిస్తే ఈ మూవీ మరింత బాగుండేదేమో. ప్రొడక్షన్ వాల్యూస్ తో పాటు డబ్బింగ్ కూడా బాగుంది.

 

తీర్పు:

 

మొత్తంగా చెప్పాలి అంటే ఈ క్రిస్టోఫర్ మూవీ స్లో గా సాగె యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పాలి. కేవలం మమ్ముట్టి నటన తప్పించి ఈ సినిమాలో ఏమి లేదు. స్లో గా సాగినా అలానే అక్కడక్కడా బోర్ కొట్టినా పర్లేదు ఇటువంటి యాక్షన్ సినిమాలు చూస్తాము అనుకునే వారికి క్రిస్టోఫర్ మూవీ పర్లేదనిపిస్తుంది.

123telugu.com Rating: 2.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు