ఓటిటి రివ్యూ : “దుర్గామతి” – హిందీ చిత్రం(ప్రైమ్ వీడియోలో ప్రసారం)

ఓటిటి రివ్యూ : “దుర్గామతి” – హిందీ చిత్రం(ప్రైమ్ వీడియోలో ప్రసారం)

Published on Dec 12, 2020 3:02 AM IST

నటీనటులు : భూమి పెడ్నేకర్, అర్షద్ వార్సీ, జిషు సేన్‌గుప్తా, మాహి గిల్

దర్శకత్వం : జి. అశోక్

నిర్మాతలు : విక్రమ్ మల్హోత్రా, భూషణ్ కుమార్, అక్షయ్ కుమార్, క్రిషన్ కుమార్

సినిమాటోగ్రఫీ : కుల్దీప్ మమానియా

పలు ఆసక్తికర ఓటిటి వెబ్ సిరీస్ లు అలాగే డిజిటల్ గా రిలీజ్ అవుతున్న సినిమాల రివ్యూస్ తో కొనసాగిస్తున్న క్రమంలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిజిటల్ రిలీజ్ తో ముందుకొచ్చిన తాజా బాలీవుడ్ చిత్రం “దుర్గామతి”.మరి ఈ చిత్రం ఎలా ఉందో ఇపుడు రివ్యూలో తెలుసుకుందాం రండి.

కథ :

అనుష్క నటించిన “భాగమతి” సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా కోసం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక నిజాయితీ గల మినిష్టర్ ఈశ్వర్ ప్రసాద్(అర్షద్ వర్సి) దగ్గర ఐఏఎస్ అయినటువంటి చంచల చౌహన్(భూమి పెడ్నేకర్) అతని పర్సనల్ సెక్రటరీ గా నియమించబడుతుంది. అతని వ్యవహారాలు అన్ని దగ్గరుండి చూసుకునే క్రమంలో ఒక సందర్భాన ఈశ్వర్ ప్రసాద్ హై కమాండ్ కు ఎదురు తిరుగుతాడు, దీనితో గవర్నమెంట్ అతన్ని దించేసి చంచలను టార్గెట్ చేస్తారు. అలా చేసి సీక్రెట్ గా దుర్గావతి హవేలీ అనే పురాతన కోటలో ఇంటరాగేట్ చేసేందుకు ఉంచుతారు. కానీ అనూహ్యంగా ఆమె కాస్తా దుర్గామతి అనే పాత్రగా ప్రవర్తించడం మొదలు పెడుతుంది. మరి అసలు ఆమె ఎందుకు అలా ప్రవర్తిస్తుంది? అలాంటి పాడుబడ్డ ఇంట్లో ఎందుకు ఆమెను ఉంచారు? మరి సినిమాలో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకుంటాయి అన్నదే అసలు కథ.

ప్లస్ పాయింట్స్ :

మొదటగా భూమి చేసిన రోల్ కోసం మాట్లాడుకున్నట్టయితే ఆమె ఈ చిత్రాన్ని తన సాయ శక్తుల నిలబెట్టే ప్రయత్నం చేసింది అని చెప్పాలి. రెండు డిఫరెంట్ వేరియేషన్స్ ను ఓ మోస్తరుగా నెట్టుకొచ్చింది. ఇక అలాగే మరికొన్ని సన్నివేశాల్లో కాన్ఫిడెంట్ నటన ఆమెలో కనిపిస్తుంది.

ఇక అలాగే ఇతర కీలక పాత్రల్లో నటించిన జిస్సు సేన్ గుప్త తన రోల్ కు పూర్తి న్యాయం చేసాడు అలాగే అర్షద్ వర్సి తన రోల్ లో ఓకే అని చెప్పొచ్చు. ఇంకా అలాగే సినిమాలో చూపించిన పలు హర్రర్ బ్యాక్ డ్రాప్ సీన్లు కానీ క్లైమాక్స్ ట్విస్ట్ కానీ డీసెంట్ గా హ్యాండిల్ చేసినట్టు అనిపిస్తుంది. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరియు వి ఎఫ్ ఎక్స్ లు కూడా ఈ చిత్రంలో మంచి ఎస్సెట్ గా నిలిచాయి.

మైనస్ పాయింట్స్ :

ఇక ఈ చిత్రంలో ఫ్లాస్ విషయానికి వస్తే చాలానే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అయితే క్యాస్టింగ్ లో లోపం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే కొంతమంది నటుల నుంచి అయితే మరింత మంచి పెర్ఫామెన్స్ ను రాబట్టి ఉండాల్సింది. ముఖ్యంగా తెలుగులో ధన్ రాజ్ చేసిన కానిస్టేబుల్ రోల్ నుంచి మెయిన్ విలన్ పాత్ర వరకు క్యాస్టింగ్ వరకు అసలేం బాలేదు.

అలాగే ఈశ్వర్ ప్రసాద్ పై డిజైన్ చేసిన కథాంశం కూడా అసలు పొంతన లేకుండా ఉన్నట్టు అనిపిస్తుంది. దీనితో అతని రోల్ అసలు ఆసక్తికరంగా సాగినట్టే అనిపించదు. మరి మరో పెద్ద డ్రా బ్యాక్ ఏంటంటే మెయిన్ లీడ్ అయినటువంటి భూమి పెడ్నేకర్ నుంచి సరైన పెర్ఫామెన్స్ ను రాబట్టకపోవడం అని చెప్పాలి. ఆమె మంచి టాలెంటెడ్ అయినప్పటికీ దర్శకుడు ఎందుకో ఆమె నుంచి అనుష్క రేంజ్ నటనను రాబట్టలేనట్టు అనిపిస్తుంది.

ఇది తెలుగు ఆడియెన్స్ ఈ సినిమా హిందీ ట్రైలర్ చూసిన పసిగట్టేస్తారు. దీనితో ఈమె రోల్ కూడా సోసో గానే ఉంటుంది. ఒక రీమేక్ సినిమా అంటే ఖచ్చితంగా పెర్ఫామెన్స్ లు అవుట్ స్టాండింగ్ గా ఉండాలి కానీ అదే మిస్ చెసేసారు. మరి ఇంకా అలాగే కొన్ని సన్నివేశాలు అనవసర ప్రయత్నం అనిపిస్తుంది అలాగే సస్పెన్స్ ఫ్యాక్టర్ ను కూడా అంత బాగా ఎలివేట్ చెయ్యలేదు. ఇవన్నీ చికాకు తెప్పించే అంశాలే.

సాంకేతిక వర్గం :

ఇంతకు ముందు చెప్పినట్టు గానే ఈ చిత్రంలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరియు విజువల్స్ మంచి ఇంప్రెసివ్ గా ఉంటాయి. వీటి పరంగా అయితే నిర్మాణ విలువలు బాగున్నాయి అని చెప్పొచ్చు. కానీ కొన్ని కొన్ని ఎమోషన్స్ అలాగే స్క్రీన్ ప్లే అంతగా వర్కౌట్ కాలేదు.

ఇక దర్శకుడు అశోక్ విషయానికి వస్తే రీమేక్ పరంగా విఫలం అయ్యాడని చెప్పాలి. క్యాస్టింగ్ లో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం, ఇంకా స్ట్రాంగ్ గా హ్యాండిల్ చెయ్యకపోవడంలో అశ్రద్ధ, ఒక్క చివరి 20 నిమిషాలు మినహాయిస్తే సరైన కథనం లోపం అలాగే కథను ఇంట్రెస్టింగ్ గా మలచకపోవడం తన వైఫల్యాలే అని చెప్పాలి.

తీర్పు :

ఇక మొత్తంగా చూసుకున్నట్టయతే “భాగమతి” రీమేక్ గా హిందీలో తెరకెక్కించిన ఈ “దుర్గామతి” అందుకోలేదనే చెప్పాలి. ఓ రీమేక్ అంటే ఖచ్చితంగా ఒరిజినాలిటీకి కాస్త భిన్నంగా మరింత అందంగా తెరకెక్కించాలి కానీ దర్శకుడు అశోక్ పనితనంతో అది కనిపించలేదు. ఒక్క క్లైమాక్స్ మరియు విజువల్స్ అలాగే మ్యూజిక్ తప్ప ఈ చిత్రంలో మెప్పించే అంశాలు అంతగా కనిపించవు. మరి తెలుగులో చూడని వారు అయితే ఓసారి చూడగలరేమో కానీ ఆల్రెడీ చూసినవారికి అయితే ఈచిత్రం అనవసరం.

123telugu.com Rating : 2.25/5
Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు