సిక్స్త్ సెన్స్ 4: మాస్ బిర్యానీ పాటకి స్టెప్పు లేసిన అప్పారావు!

Published on Aug 4, 2021 5:04 pm IST

సిక్స్త్ సెన్స్ సీజన్ 4 ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటుంది. అయితే ఓంకార్ యాంకర్ గా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమం లో ఈ వారాంతం డబుల్ ఎంటర్ టైన్మెంట్ పక్కా అనేలా ఉంది ప్రోమో. అయితే అప్పారావ్, శివజ్యోతీ, ఇంద్రజ, సుడిగాలి సుధీర్ లు కలిసి ఈ వారాంతం అందరినీ అలరించనున్నారు.

అయితే అప్పారావ్ మొదటగా రవితేజ హీరోగా నటించిన క్రాక్ చిత్రం లోని పాట కి మాస్ స్టెప్పులు వేశారు. అయితే ఆ స్టెప్పులు అక్కడి ప్రేక్షకులు విజిల్స్, చప్పట్ల తో సంతోషం వ్యక్తం చేశారు. అయితే సుడిగాలి సుధీర్ పంచు డైలాగు లు ఈ ప్రోమో లో గట్టిగానే పేలాయి. అయితే ఈ శని మరియు ఆదివారాలు రాత్రి 9 గంటలకు స్టార్ మా లో ఈ కార్యక్రమం ప్రసారం కానుంది.

సంబంధిత సమాచారం :