శివజ్యోతి పెర్ఫార్మెన్స్ తో కన్నీటి పర్యంతమైన “శ్రీదేవి డ్రామా కంపనీ” టీమ్!

Published on Aug 15, 2021 7:27 pm IST

బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి ఈటివి కార్యక్రమాలు. ఇందులో ముఖ్యంగా శ్రీదేవి డ్రామా కంపనీ ప్రేక్షకులకి మరింత చేరువ అయింది అని చెప్పాలి. తాజాగా విడుదల అయిన ప్రోమో తో అటు ఎంటర్ టైన్మెంట్ తో పాటుగా, కన్నీరు పెట్టే విధంగా వీరి ప్రదర్శన ఉండటం హైలెట్ అని చెప్పాలి.

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు దగ్గర పడుతుండటం తో శ్రీదేవి డ్రామా కంపనీ వరుస మెగాస్టార్ డాన్స్ పెర్ఫార్మెన్స్ లు మాత్రమే కాకుండా స్కిట్ లతో సైతం అలరిస్తుంది. రాఖీ పండుగ సందర్భంగా చేసిన స్కిట్స్ ప్రోగ్రాం లో ఎంటర్ టైన్మెంట్ అందించడం మాత్రమే కాకుండా అందరినీ కన్నీరు పెట్టించే విధంగా శివ జ్యోతి పెర్ఫార్మెన్స్ ఉందని చెప్పాలి. ఇందుకు సంబంధించిన పూర్తి ఎపిసొడ్ ను చూడాలి అంటే వచ్చే ఆదివారం మధ్యాహ్నం 01:00 గంటలకు శ్రీదేవి డ్రామా కంపనీ ప్రోగ్రాం చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :