లేటెస్ట్..డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ గా సూర్య పవర్ఫుల్ ప్రాజెక్ట్.!

Published on Aug 5, 2021 11:50 am IST

కోలీవుడ్ అగ్ర హీరోల్లో మన తెలుగు మార్కెట్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోల్లో సూర్య కూడా ఒకరు. మరి సూర్య హీరోగా నటించిన లాస్ట్ చిత్రం “ఆకాశం నీ హద్దురా” తో డైరెక్ట్ ఓటిటిలోనే భారీ కైవసం చేసుకున్నాడు. మరి ఈ సినిమా హిట్ ఇచ్చిన బూస్టప్ లోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లను స్టార్ట్ చేసాడు. అయితే వాటిలో మరో పవర్ ఫుల్ లాయర్ డ్రామా “జై భీం” కూడా ఒకటి.

దీని అధికారిక పోస్టర్ ని ఈ మధ్యే విడుదల చెయ్యగా దానికి సాలిడ్ రెస్పాన్స్ కూడా వచ్చింది. అయితే ఇపుడు సూర్య నుంచి మళ్ళీ సినిమా కూడా డైరెక్ట్ ఓటిటి రిలీజ్ కే కన్ఫర్మ్ అవ్వడం హాట్ టాపిక్ గా మారింది. వచ్చే నవెంబర్ నెలలో ఈ చిత్రాన్ని దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేస్తున్నట్టుగా సూర్య ప్రకటించారు.

మరి దీనికి గల కారణం ఏమిటి అన్నది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మరి జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సూర్య మరియు జ్యోతిక దంపతులు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ చిత్రం తమిళ్ మరియు తెలుగు భాషల్లో ఏకకాలంలో రిలీజ్ కి కన్ఫర్మ్ అయ్యింది.

సంబంధిత సమాచారం :