మరో వివాదంలో బిగ్ బాస్ షో, ఈసారి విద్యార్థులు

Published on Jul 17, 2019 3:05 pm IST

గత కొద్దిరోజులుగా బిగ్ బాస్ రియాలిటీ షో నిర్వాహకులపై నటి శ్వేతా రెడ్డి,అలాగే గాయత్రీ గుప్తాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. షోలో కి ఎంపికయ్యారు అని నమ్మించి, చివరకు లైంగిక వేధింపులకు గురిచేశారని పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయడం జరిగింది. అంతే కాకుండా దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి బిగ్ బాస్ షో ప్రదర్శన నిలిపివేయాలంటూ తెలంగాణా హై కోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేయడం జరిగింది.

ఇవి చాలదన్నట్టు ఓయూ విద్యార్థులు వీరికి మద్దతుగా ఆందోళన మొదలుపెట్టారు. లైంగిక వేదింపులు, కాస్టింగ్ కౌచ్ వంటి అసాంఘిక కార్యక్రమాలకు కారణమౌతున్న బిగ్ బాస్ షో నిర్వహణ ఆపివేయాలని, లేని పక్షంలోషో వ్యాఖ్యాత అయిన నాగార్జున ఇంటితో పాటు,షో నిర్వాహకుల నివాసాలను ముట్టడిస్తాం అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇంకా నాలుగు రోజుల్లో ప్రసారం మొదలుకానున్న నేపథ్యంలో వరుస వివాదాలు ఈ రియాలిటీ షో నిర్వాహకులకు సందిగ్ధంలో పడే పరిస్థితికి చేరింది. మరి ఇన్ని ఆంక్షల మధ్య బిగ్ బాస్ షో నిర్వహిస్తారో లేదో చూడాలి మరి.

సంబంధిత సమాచారం :