టాలీవుడ్ న్యూ గేమ్ చేంజర్ @ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్

TFI
ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు మాత్రమే ఓవర్సీస్ లో రిలీజ్ అయ్యేవి. అక్కడ వచ్చే కలెక్షన్స్ సినిమాకి ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఏ తప్ప నిర్మాతలకి భారీ ప్రాఫిట్స్ తెచ్చిపెట్టే స్థాయిలో ఉండేది కాదు.. కానీ ఇప్పుడు ఆ సంస్కృతి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు తెలుగు సినిమాల ఓవర్సీస్ రెవిన్యూ కూడా బాగా ఎక్కువగా వస్తూ మాంచి ప్రాఫిట్స్ ని తెచ్చి పెడుతోంది. దానికి ప్రధాన కారణం ఇప్పుడు ఓవర్సీస్ లో మన ఇండియన్ పాపులేషన్ బాగా ఎక్కువ అవుతుండడం.

అలాగే మన ఇండియన్ సినిమాలు బాగా ఎక్కువగా యుఎస్ లో రిలీజ్ అవుతుండడం, అక్కడి ఇండియన్ కి ఎంటర్టైన్మెంట్ కోసం సినిమాలే ప్రధాన మాంద్యంగా మారడంతో అక్కడ స్క్రీన్స్ పెరిగాయి. దాంతో ప్రతి ఏరియాలోనూ వారాంతంలో ఇండియన్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. దాంతో సినిమాకి యుఎస్ లో కూడా గ్రాండ్ రిలీజ్ కి అవకాసహం దొరకడమే కాకుండా ఎక్కువ రెవిన్యూ సాధించడానికి కూడా ఆస్కారం దొరుకుతోంది. ఈ విషయంలో ఇటీవల వచ్చిన బాహుబలి మరియు శ్రీమంతుడు సినిమాలకి ఇండస్ట్రీ స్పెషల్ థాంక్స్ చెప్పుకోవాలి. ఈ రెండు సినిమాలు ఓవర్సీస్ లో తెలుగు సినిమాల మార్కెట్ స్థాయిని బాగా పెంచేశాయి. దాంతో ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థల వారు ఇక్కడ ఓ స్టార్ హీరో సినిమా లాంచ్ అవ్వగానే ఆ సినిమా అఒవర్సీస్ రైట్స్ కోసం ఎగబడుతున్నారు.

అందులో భాగంగానే ఇటీవలే లాంచ్ అయ్యి షూటింగ్ కూడా మొదలు కాని నితిన్ – త్రివిక్రమ్ ల ‘అ.. ఆ’ మరియు నాగ చైతన్య ‘మజ్ను’ సినిమాలను భారీ మొత్తానికి కొనుగోలు చేసారు. సినిమా రిలీజ్ కి ముందే ఈ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ అవ్వడం నిర్మాతలను ప్రాఫిట్ జోన్ లోకి తోస్తోంది. దీనితో పాటు ప్రమోషన్స్ విషయంలో కూడా టాలీవుడ్ అడ్వాన్స్ అయ్యింది. దాంతో ప్రస్తుతం యుఎస్ లో కూడా ప్రమోషనల్ టూర్స్ చెయ్యడం మొదలు పెట్టారు. మొదటగా అఖిల్ అక్కినేని తన మొదటి సినిమా అఖిల్ కోసం యుఎస్ లో టూర్ నిర్వహించాడు. ఈ టూర్ మరింత ఎక్కువగా బాక్స్ ఆఫీసు వద్ద డాలర్స్ కురిపిస్తుందని ఆశిస్తున్నారు.

Exit mobile version