ఎమోష‌న్స్‌ తో పాటు మంచి మెసేజ్ ఉన్న సినిమా – పి.వి.సింధు

ఎమోష‌న్స్‌ తో పాటు మంచి మెసేజ్ ఉన్న సినిమా – పి.వి.సింధు

Published on Sep 1, 2019 12:35 PM IST

ఐశ్వర్యా రాజేష్‌, నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌ ముఖ్య పాత్రల్లో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మించిన చిత్రం ‘కౌసల్య క ష్ణమూర్తి ది క్రికెటర్‌’. ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో ప్రముఖ తమిళ్‌ హీరో శివ కార్తికేయన్‌ నటించారు. ఆగ‌స్ట్ 23న విడుద‌లైన ఈ చిత్రం మంచి టాక్ ను ద‌క్కించుకోవ‌డ‌మే కాదు.. అప్రిషియేష‌న్స్ అందుకుంటుంది. ప్ర‌పంచ బాడ్మింట‌న్ చాంపియ‌న్ పి.వి.సింధు, కోచ్ పుల్లెల గోపీచంద్, చాముండేశ్వ‌రినాథ్ త‌దిత‌రులు ఈ చిత్రాన్ని శ‌నివారం హైదరాబాద్ రామానాయుడు స్టూడిలో ప్రత్యేకంగా వీక్షించారు.

సినిమా చూశాక పి.వి.సింధు మూవీ గురించి మాట్లాడుతూ.. సినిమా చూశాను. చాలా బావుంది. అమ్మాయిలు బ‌య‌ట‌కొచ్చి వారేంటి? ఎలా నిరూపించుకున్నారు? అన్న అంశాల‌ను ఈ సినిమాలో చూపించారు. మ‌రో ప‌క్క రైతు స‌మ‌స్య‌ల‌ను ఎవ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకోరు? చిన్న‌గానే చూస్తారు. కానీ అలాంటి రైతుల స‌మ‌స్య‌ల‌ను గుర్తించాల‌ని ఈ సినిమాలో చూపించారు. మ‌నం ఈ రోజు తింటున్నామంటే కార‌ణం రైతులే. అమ్మాయిలు న‌మ్మ‌కంతో ముందుకొచ్చి క్రికెట్ ఆడ‌టం అనే విష‌యంతో పాటు రైతుల విలువేంటి? అనే మెసేజ్‌ను ఈ చిత్రం ద్వారా ఇచ్చారు. త‌ల్లిదండ్రుల న‌మ్మ‌కాన్ని నిజం చేయ‌డానికి కౌస‌ల్య ఎంత క‌ష్ట‌ప‌డిందో ఈ సినిమాలో మ‌నం చూడొచ్చు. చాలా మంచి మెసేజ్‌, ఎమోష‌న్స్ ఉన్న సినిమా. ఐశ్వ‌ర్యా రాజేష్ చాలా నేచుర‌ల్ న‌టించ‌డ‌మే కాదు.. చాలా హార్డ్‌వ‌ర్క్ చేసింది అని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు