ముందస్తు బెయిల్ కోరిన రజనీకాంత్ దర్శకుడు

Published on Jun 13, 2019 3:36 pm IST

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా వెంట వెంటనే ‘కబాలి, కాలా’ లాంటి సినిమా చేసి సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్నారు దర్శకుడు పా.రంజిత్. తన సినిమాల్లో ఎక్కువగా దళితులపై జరుగుతున్న దురాగతాలను, వాటిపై దళితుల పోరాటాల్ని ఎక్కువగా ఎలివేట్ చేస్తుంటారాయన. అందుకే ఈయనకు దళిత పక్షపాతి అనే పేరు వచ్చింది. రజనీ కూడా ఈయనపై ప్రత్యేక అభిమానం చూపుతుంటారు.

ఇంతవరకు బాగానే ఉన్నా నీల పులిగ‌ల్ ఇయ‌క్కం సంస్థ‌ స్థాపకుడు ఉమర్ ఫరూక్ వర్థంతి సందర్బంగా జరిగిన ర్యాలీలో రంజిత్ మాట్లాడుతూ రాజరాజ చోళన్ పాలనలో దళితులు అనేక కష్టాలు పడ్డారని, అదొక చీకటి దశ అని అన్నారు. దీంతో తంజావూర్ హిందూ మ‌క్క‌ల్ క‌ట్చీ మాజీ సెక్రెటరీ కా బాల తమ మనోభావాలు దెబ్బతినేలా, జనాన్ని రెచ్చగోట్టేలా రంజిత్ అనుచిత వ్యాఖ్యలు చేశారని పోలీసులకు పిర్యాధు చేశారు. పోలీసులు సైతం ఇరు వర్గాల మధ్య శత్రుత్వం పెంచేలా, అల్లర్లను రెచ్చగోట్టేలా వ్యాఖ్యలు చేసినందుకు రంజిత్ మీద కేసు నమోదుచేశారు.

దీంతో రంజిత్ తనపై నమోదైన కేసుల్లో ముందస్తు బెయి కోరుతూ మద్రాస్ హైకోర్టులోని మధురై బెంచ్ ముందు పిటిషన్ పెట్టుకున్నారు. పిటిషన్ స్వీకరించిన బెంచ్ త్వరలోనే దాన్ని పరిశీలించనుంది.

సంబంధిత సమాచారం :

More