ఆగష్టు 14న థియేటర్లలోకి వస్తున్న “పాగల్”..!

Published on Aug 7, 2021 7:09 pm IST

విశ్వక్‌సేన్ హీరోగా నరేశ్ కుప్పిలి దర్వకత్వంలో నిర్మాత దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో బెక్కం వేణుగోపాల్ నిర్మించిన లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ “పాగల్”. కరోనా కారణంగా వాయిదాపడుతూ వచ్చిన ఈ సినిమాకు తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. ఈ నెల 14న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు రిలీజ్ డేట్‌తో కూడిన పోస్టర్‌ను విడుదల చేశారు.

ఇదిలా ఉంటే ‘హిట్’ సినిమా తరువాత విశ్వక్‌సేన్ చేస్తున్న మూవీ కావడం, ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుద‌లైన పాట‌లు, టీజ‌ర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాలో నివేదా పేతురాజ్ లీడ్ హీరోయిన్‌గా నటిస్తుండగా, హీరోయిన్స్‌ సిమ్రాన్ చౌద‌రి, మేఘా లేఖ కూడా కనిపించనున్నారు.

సంబంధిత సమాచారం :