విశ్వక్ సేన్ “పాగల్” ట్రైలర్ కి ముహూర్తం ఫిక్స్!

Published on Aug 9, 2021 8:30 pm IST

నరేష్ కుప్పిలి దర్శకత్వం లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరో గా నటిస్తున్న తాజా చిత్రం పాగల్. దిల్ రాజు సమర్పణ లో బెక్కెమ్ వేణుగోపాల్ ఈ చిత్రంను లక్కీ మీడియా పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రం లో సిమ్రాన్ చౌదరీ మరియు నివేథా పేతురాజ్ లు హీరోయిన్ లు గా నటిస్తున్నారు. ఈ చిత్రం ను ఆగస్ట్ 14 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

తాజాగా ఈ చిత్రం యొక్క ట్రైలర్ ను ఎప్పుడు విడుదల చేస్తారు అనే దాని పై ఒక క్లారిటీ వచ్చింది. ఆగస్ట్ 10 వ తేదీన ఉదయం 11:11 గంటలకు ఈ చిత్రం ట్రైలర్ నీ విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించడం జరిగింది. రథన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, ఈ చిత్రం విడుదల కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. విడుదల అయిన పాగల్ టైటిల్ సాంగ్ మరియు పోస్టర్ ల తో సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.

సంబంధిత సమాచారం :