పాగల్ వీడియో సాంగ్ కి వస్తున్న సూపర్బ్ రెస్పాన్స్!

Published on Aug 8, 2021 4:32 pm IST

విశ్వక్ సేన్ మరియు నివేథా పేతురాజ్ హీరో హీరోయిన్ లుగా కలిసి నటిస్తున్న తాజా చిత్రం పాగల్. ఈ చిత్రం లో మురళి శర్మ, రాహుల్ రామకృష్ణ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ వస్తున్న ఈ చిత్రాన్ని నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు సమర్పణ లో వస్తున్న ఈ చిత్రాన్ని లక్కీ మీడియా పతాకంపై బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. నేడు ఉదయం ఈ చిత్రం నుండి పాగల్ వీడియో సాంగ్ విడుదల అయిన సంగతి అందరికి తెలిసిందే. పాట విడుదల అయిన కొద్ది సేపటికే ఈ చిత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యూ ట్యూబ్ లో నాలుగు గంటల్లో 4 లక్షలకు పైగా వ్యూస్ సొంతం చేసుకోవడం మాత్రమే కాకుండా ప్రేక్షకులని విశేషం గా ఆకట్టుకుంటుంది.

పాగల్ చిత్రం ఈ నెల 14 వ తేదీన విడుదల కి సిద్దం అవుతోంది. ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావల్సి ఉండగా, కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. తాజాగా ఈ చిత్రం విడుదల తేదీ ఫిక్స్ అవ్వడం తో సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :