ఇండియన్ స్క్రీన్ మీదే రాని ఆ సర్ ప్రైజ్ ఎలిమెంట్ ఏమిటో ?

Published on Dec 13, 2018 7:28 pm IST

హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా రాబోతున్న చిత్రం ‘పడి పడి లేచె మనసు’. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 21 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని సమకూర్చారు. ఇప్పటికే ఈ చిత్రం ఆల్బమ్ మంచి హిట్ అయింది.

అయితే ఇంతవరకు ఇండియన్ స్క్రీన్ మీదే రాని ఓ సర్ ప్రైజ్ ఎలిమెంట్ ఈ సినిమాలో ఉందని… ఖచ్చితంగా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని చెబుతుంది చిత్రబృందం. ఇంతకీ ఆ సర్ ప్రైజ్ ఎలిమెంట్ ఏమిటి, ముఖ్యంగా సెకెండాఫ్ లో రానున్న ఆ ఎలిమెంట్స్ ప్రేక్షకులకు కనెక్ట్ అయినదాని బట్టి ఈ చిత్రం ఏ రేంజ్ లో విజయం సాధిస్తోందో చెప్పొచ్చు అట. ఒకవేళ ఆ ఎలిమెంట్స్ గాని కనెక్ట్ అవ్వకపోతే, సినిమా పరిస్థితి ఏమిటి. అసలకే హను తన స్క్రిప్ట్ లో ట్రాక్స్ ఎక్కువుగా రాస్తాడు అని పేరు ఉంది. మరి ఈ సినిమాలో కూడా సర్ ప్రైజ్ ఎలిమెంట్ అని చెప్పి ఓ సెపెరేట్ ట్రాక్ రాశాడా. రాస్తే ఆ ట్రాక్ కథకు ఎంతవరకు కనెక్ట్ అయింది అన్న దాని బట్టే ఈ సినిమా ఫలితం ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి చూద్దాం హను చెప్పాలననుకున్న ఆ సర్ ప్రైజ్ ఎలిమెంట్ కి రేపు ఆడియన్స్ కూడా సర్ ప్రైజ్ అవుతారేమో.. !

సంబంధిత సమాచారం :