ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ హిట్ గ్యారింటీ అట !

ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ హిట్ గ్యారింటీ అట !

Published on Dec 15, 2018 5:52 PM IST

శర్వానంద్, సాయి పల్లవి జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘పడి పడి లేచె మనసు’ డిసెంబర్ 21 న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్దమవుతుంది. ప్రేమ కథ చిత్రాల దర్శకుడు హను రాఘవ పూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో శర్వా ఫుట్ బాల్ ప్లేయర్ గా నటిస్తుండగా.. సాయి పల్లవి డాక్టర్ గా కనిపించనుంది.

కాగా సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిచిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని సమకూర్చారు. ఇక ఈ సినిమాలో శర్వానంద్, సాయి పల్లవి మధ్య వచ్చే కొన్ని సీన్లు మనసు పిండేసేలా ఎమోషనల్‌గా ఉండబోతున్నాయట.

ఈ చిత్రం ప్రేమలోని ఒక సరికొత్త కోణాన్ని తెరపై ఆవిష్కరించబోనుందని.. అలాగే ఈ సినిమాలో ఉన్న ఓ కొత్త సర్ ప్రైజ్ ఎలిమెంట్ కూడా బాగా ఆకట్టుకుంటుందని.. ఖచ్చితంగా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని చిత్రబృందం నమ్మకంగా చెబుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు