చైనా లో ‘ప్యాడ్ మాన్’ లేటెస్ట్ కలక్షన్స్ !

చైనా లో ‘ప్యాడ్ మాన్’ లేటెస్ట్ కలక్షన్స్ !

Published on Dec 17, 2018 12:19 PM IST

అతి తక్కువ ధర కలిగిన సానిటరీ ప్యాడ్ మేకింగ్ యంత్రం ఆవిష్కర్త అరుణాచలం మురుగనాథం నిజ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ప్యాడ్ మాన్’. అక్ష‌య్ కుమార్, ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో రాధికా ఆప్టే, సోన‌మ్ క‌పూర్‌ ముఖ్య పాత్రల్లో నటించారు. ప్రముఖ దర్శకుడు ఆర్ బాల్కీ తెరకెక్కించిన ఈ చిత్రం ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలై బాలీవుడ్ లో 100కోట్ల కు పైగా వసూళ్లను రాబట్టింది.

ఇక తాజాగా ఈచిత్రం చైనా లో రికార్డు స్థాయిలో 4000 స్క్రీన్లలో విడుదలైయింది. అయితే మొదటి రోజు కేవలం 11కోట్లను మాత్రమే రాబట్టిన ఈచిత్రం తరువాతి రెండు రోజులు పుంజుకొని మూడు రోజులకుగాను అక్కడ 37.4కోట్ల వసూళ్లను రాబట్టిందని సమాచారం. ఇక ఇటీవల ‘దంగల్ , బాహుబలి 2’ చిత్రాలు చైనా లో విడుదలై రికార్డు కలక్షన్లను రాబట్టాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు