తమిళ హీరో విశాల్ తను నటించిన సినిమాలు తెలుగులో కూడా విడుదల చేస్తూ అక్కడ కూడా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఇటీవల ‘అభిమన్యుడు’చిత్రం తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా అయన కెరిర్ లోనే అత్యధిక కలెక్షన్ల ను రాబట్టిన చిత్రం గా రికార్డు సృష్టించింది.
ఇక ఇప్పుడు అయన తమిళ భాషలో నటిస్తున్న చిత్రం ‘సందకోడి 2’. లింగు సామీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో విశాల్ సరసన కీర్త్తి సురేష్ నటిస్తుంది. ఇక ఈ చిత్ర తెలుగు అనువాద హక్కులను రూ.10 కోట్ల భారీ మొత్తానికి ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు దక్కించుకున్నారు. తెలుగులో’పందెకోడి 2′ పేరుతో రానున్న ఈ చిత్రం అక్టోబర్ 18 న విడుదల కానుంది.


