జెర్సీ ని నార్త్ లో విడుదల చేయనున్న ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ !

Published on Feb 20, 2019 3:06 pm IST

నాని నటిస్తున్న మచ్ అవైటెడ్ మూవీ ‘జెర్సీ’ షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం నిర్మాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఇక ఈ చిత్రాన్ని నార్త్ ఇండియాలో విడుదల చేయనుంది ప్రముఖ బాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ పనోరమా స్టూడియోస్. ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని సరసన కన్నడ నటి శ్రద్ధ శ్రీనాథ్ నటిస్తుంది. ఈ చిత్రం యొక్క శాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ ఛానెల్ జీ తెలుగు సొంతం చేసుకోగా డిజిటల్ హక్కులను జీ5 సొంతం చేసుకుంది. ఈహక్కులకు గాను జీ నెట్ వర్క్ భారీ మొత్తాన్ని చెల్లించిందని సమాచారం.

‘మళ్ళీరావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవి చంద్రన్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్లో విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :