పంతం 6 రోజుల కలక్షన్స్ !

12th, July 2018 - 05:16:03 PM

వరుస పరాజయాల తరువాత హీరో గోపిచంద్ ఇటీవల’పంతం’ చిత్రంతో ప్రేక్షకులముందుకు వచ్చారు. సోషల్ కాజ్ తో తెరకెక్కిన ఈచిత్రం బి , సి సెంటర్లలో మంచి రన్ ను కనబరుస్తుంది. సినిమా రొటీన్ గా ఉండడం వల్ల ఏ సెంటర్ ప్రేక్షకులనుండి మిశ్రమ స్పందన లభిస్తుంది. ఇక గత వారం విడుదలైన ఈ చిత్రం 6రోజులకు గాను ప్రపంచ వ్యాప్తంగా రూ.14కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. అయితే ఈ రోజు విడుదలైన చిత్రాలు’పంతం’ కలక్షన్స్ ఫై ప్రభావం చూపనున్నాయి. మరి వాటికి దీటుగా కలక్షన్స్ ను రాబడితే ఈ చిత్రం లాభాల్లోకి ప్రవేశిస్తుంది.

నూతన దర్శకుడు చక్రి తెరకెక్కించిన ఈ చిత్రంలో గోపీచంద్ సరసన మెహ్రీన్ కథనాయికగా నటించింది. సత్యసాయి ఆర్ట్స్ పతాకంఫై కే కే రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించారు.