గోపీచంద్ , మెహ్రీన్ లు జంటగా నూతన దర్శకుడు చక్రి తెరకెక్కించిన చిత్రం పంతం. గోపీచంద్ 25 వ సినిమా గా ఇటీవల విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ ను రాబట్టి సుమారు 15కోట్ల గ్రాస్ ను ఖాతాలో వేసుకుంది ఈ చిత్రం.
ఇక ఈ చిత్ర కలెక్షన్స్ పట్ల హర్షం వ్యక్తం చేశారు చిత్ర నిర్మాత రాధా మోహన్. మంచి సోషల్ కాజ్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని విజయవంతం చేసినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు . శ్రీ సత్య సాయి ఆర్ట్స్ పతాకం ఫై రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిచారు.


