గోపీచంద్ పంతం వచ్చేది అప్పుడే!

8th, April 2018 - 06:19:00 PM

ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని టాలీవుడ్ హీరో గోపీచంద్ గత కొంత కాలంగా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడు. కష్టపడే తత్వం ఉన్నప్పటికీ మంచి కథ తగలకపోవడంతో కెరీర్ లో ఇంకా బాక్స్ ఆఫీస్ హిట్ అందుకునే స్థాయికి రావడం లేదు. అయితే ఈ సారి ఎలాగైనా బాక్స్ ఆఫీస్ పై తన పంతాన్ని నెగ్గించుకోవాలని గోపి పంతం అనే సినిమాతో రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ఆ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది.

ఇకపోతే రీసెంట్ గా చిత్ర యూనిట్ సినిమా విడుదల తేదీని ప్రకటించింది. సమ్మర్ చివరి దశలో.. అంటే జూన్ 5న కూల్ గా సినిమాను రిలీజ్ చేసేందుకు పంతం యూనిట్ ఫిక్స్ అయ్యింది. హీరో గోపీచంద్ ఈ ప్రాజెక్ట్ పై చాలా నమ్మకంతో ఉన్నాడు. చిత్ర యూనిట్ కూడా సినిమా తప్పకుండా అందరికి నచ్చుతుందని చెబుతోంది. చక్రవర్తి దర్శకత్వం వహించిన పంతం సినిమాను బెంగాల్ టైగర్ ప్రొడ్యూసర్ కె. రాధామోహన్ నిర్మిస్తున్నారు. పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకు గోపి సుందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. గోపీచంద్ సరసన మెహ్రీన్ కథానాయికగా నటిస్తోన్న సంగతి తెలిసిందే.