మాచో హీరో గోపిచంద్ నటించిన 25 వ చిత్రం పంతం. మంచి అంచనాల మధ్య గత గురువారం విడుదలైన ఈ చిత్రం యావరేజ్ టాక్ ను సొంతం చేసుకున్న కలెక్షన్స్ పరంగా దూసుకెళుతుంది. నాలుగు రోజులకు గాను ఈ చిత్రం 10. 50 కోట్ల గ్రాస్ ను అలాగే 6. 77 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇక ఈ సోమవారం నుండి ఇదే రన్ ను కొనసాగిస్తే ఈ చిత్రం ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అవుతుంది.
నూతన దర్శకుడు చక్రి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో గోపీచంద్ సరసన మెహ్రీన్ కథనాయికగా నటించింది. సత్యసాయి ఆర్ట్స్ పతాకంఫై కే కే రాధామోహన్ నిర్మించిన ఈచిత్రానికి గోపిసుందర్ సంగీతం అందించారు.
| Area | Collections |
| నైజాం | Rs 1,96,00,000 |
| సీడెడ్ | Rs 1,05,00,000 |
| నెల్లూరు | Rs 26,00,000 |
| గుంటూరు | Rs 64,59,159 |
| కృష్ణ | Rs 43,49,284 |
| పశ్చిమ గోదావరి | Rs 37,27,623 |
| తూర్పు గోదావరి | Rs 46,42,443 |
| ఉత్తరాంధ్ర | Rs 83,03,531 |
| మొత్తం నాలుగు రోజుల ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ షేర్ | Rs 6.02 Cr |
| రెస్ట్ అఫ్ ఇండియా | Rs 50,00,000 |
| ఓవర్సీస్ | Rs 25,00,000 |
| మొత్తం నాలుగు రోజులకు గాను ప్రపంచ వ్యాప్తంగా షేర్ | Rs 6.77 Cr |


