దర్శకుడు సంపత్ నంది నిర్మాణంలో తెరకెక్కతున్న తాజా చిత్రం ‘పేపర్ బాయ్’. నూతన నటీనటులతో రూపొందుతున్న ఈ చిత్రం పై మంచి అంచనాలే ఉన్నాయి. కాగా ఈ చిత్రంలోని సెకెండ్ సాంగ్ ‘చినుకై కురిసింది’ పాటను రేపు సాయంత్రం నాలుగు గంటలకు విడుదల చేయబోతున్నామని చిత్ర బృందం ఈ రోజు అధికారికంగా ట్విట్టర్ వేదికగా ప్రకటించింది.
కాగా నూతన దర్శకుడు జయశంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కొత్త కథాంశంతో వస్తుందని తెలుస్తోంది. ముఖ్యంగా హీరో హీరోయిన్ల మధ్య సాగే ప్రేమ సన్నివేశాలు చాలా కొత్తగా ఉంటాయని, వైవిద్యమైన ఈ ప్రేమ కథ మొత్తం కొత్త నేపథ్యంలో సాగుతుందని సమాచారం. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందిస్తుండగా సంతోష్ శోభన్, రియా, తాన్య హోప్ హీరో హీరోయిన్లు గా నటిస్తున్నారు.
